telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఇంటర్ విద్యార్థిని లారా అదృశ్యం కేస్…

ఇంటర్ విద్యార్థిని లారా అదృశ్యం కేస్ మిస్టరీ వీడింది. 16 ఏళ్ల లారా అదృశ్యం కేసు ఈ మధ్య హాట్ టాపిక్ గా మారింది. నాలుగు రోజుల క్రితం తన పేరెంట్స్ మందలించారని అర్ధరాత్రి ఇంటి నుండి వెళ్ళిపోయింది లారా. విషయం తెలుసుకున్న పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. 7 బృందాలుగా లారా కోసం గాలించారు హయత్ నగర్ పొలిసులు. కానీ ఆ నాలుగు రోజులు ఇంటికి సమీపం లోని చెట్ల పొదల్లోనే లారా గడిపింది. అయితే జంతువులు అంటే లారా కు భయం లేదని అందుకే చెట్ల పొదల్లో గడిపింది అని లారా పేరెంట్స్ చెప్పారు. తమది జంతి ప్రేమికుల కుటుంభం అని వారు తెలిపారు. కానీ ఆ నాలుగు రోజులుగా కనీసం మంచి నీళ్ళు కూడా తీసుకోకపోవడం తో నీరసం అయి దగ్గర లోని గుడిసె వద్దకు వెళ్ళింది. అప్పుడు వాళ్ళు లారా ను ఇంటికి తీసుకు వచ్చారు. అయితే మొబైల్ లో చాటింగ్ చేయొద్దు , గేమ్స్ ఆడొద్దు అని పేరెంట్స్ చెబితే అది పిల్లల మంచికే అని గుర్తించాలి. ఇలా చిన్న చిన్న విషయాలకు పిల్లలు ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు అని పోలీసులు చెప్తున్నారు.

Related posts