kadiyam srihari on reforms of govt education

ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగింది: కడియం

22

గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకున్న కార్యక్రమాల వల్ల ప్రజల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగిందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని, ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు.

ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేపడుతారు. నియామకాలు చేపడితే వారి అనుబంధ విద్యార్థి సంఘం నాయకులు కోర్టుకెళ్లి స్టేలు తేవడమేంటని అని కడియం ప్రశ్నించారు.