telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో ఇద్దరికీ నామకరణం.. కరోనా కుమారి.. కరోనా కుమార్!

New born baby

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీలో పుట్టిన ఇద్దరు చిన్నారులకు కరోనా పేరు కలసి వచ్చేలా నామకరణం చేశారు. 1979లో అమెరికా తొలి స్పేస్ స్టేషన్ స్కైలాబ్ హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది. ఆ సమయంలో పుట్టిన వారికి ‘స్కైలాబ్’ అనే పేర్లు పెట్టారు. ఇలాంటి సందర్భాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. తాజాగా ప్రపంచాన్ని కరోనా కబళిస్తున్న నేపథ్యంలో తాజాగా పుట్టిన వారికి కరోనా పేర్లు పెడుతున్నారు.

ఏపీలోని కడప జిల్లా వేంపల్లె పట్టణంలో జన్మించిన ఇద్దరికి ఈ వైరస్ పేర్లు పెట్టారు. మండలంలోని అలిరెడ్డిపల్లెకు చెందిన రమాదేవి, తాళ్లపల్లెకు చెందిన శశికళ పురిటి నొప్పులతో పట్టణంలోని బాషా ఆసుపత్రిలో చేరారు. నిన్న వీరిలో ఒకరికి అబ్బాయి జన్మించగా, మరొకరికి అమ్మాయి పుట్టింది. ఆసుపత్రి నిర్వాహకుడు అయిన డాక్టర్ బాషా వీరికి ఆపరేషన్ చేసి పురుడు పోశారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో అబ్బాయికి కరోనా కుమార్, అమ్మాయికి కరోనా కుమారి అని పేర్లు పెట్టారు. ఇందుకు వారి తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో ఆ పేర్లనే ఖరారు చేశారు.

Related posts