telugu navyamedia
సినిమా వార్తలు

“కబీర్ సింగ్” ప్రీమియర్ షో టాక్

Kabir-SIngh

టాలీవుడ్లో చిన్న సినిమాగా రూపొందిన “అర్జున్ రెడ్డి” అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయ్ దేవరకొండను స్టార్ రేసులోకి తీసుకొచ్చింది. సందీప్ వంగా దర్శకత్వం ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా “కబీర్ సింగ్” టైటిల్ తో తెరకెక్కించారు. హిందీ వర్షన్ కి కూడా సందీప్ వంగానే దర్శకత్వం వహించారు. ఈరోజు అంటే జూన్ 21న “కబీర్ సింగ్” చిత్రం విడుదలవుతోంది. కాగా గల్ఫ్ దేశాల్లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు ప్రసారం చేశారు. ప్రేక్షకుల నుంచి “కబీర్ సింగ్” చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. షాహిద్ కపూర్ నటనతో అదరగొట్టేశాడని, పాత్రలో ఒదిగిపోయాడని ప్రీమియర్ షో చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కథలో పెద్దగా మార్పులు చేయకుండా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. సందీప్ వంగా దర్శకత్వం బావుందని అంటున్నారు. ప్రముఖ క్రిటిక్ ఉమర్ సందు కబీర్ సింగ్ చిత్రం గురించి ట్వీట్ చేస్తూ “సెన్సార్ లో ఈ చిత్రాన్ని చూశా. షాహిద్ కపూర్ తన పెర్ఫామెన్స్ తో హృదయాలు కొల్లగొట్టేశాడు. అద్భుతమైన చిత్రం” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ చిత్రంపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.

Related posts