telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉజ్జ‌ల్ భూయాన్‌ ప్ర‌మాణం..8 నెల‌లు త‌రువాత రాజ్‌భ‌వ‌న్‌కు కేసీఆర్‌

*హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం
*తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా సీజేగా ఉజ్జ‌ల్ భూయాన్‌
*రాజ‌భ‌వ‌న్‌లో ప్ర‌మాణం స్వీకారం చేయించిన‌ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై
*తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత ఐద‌వ న్యాయ‌మూర్తిగా ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేసారు
*8 నెల‌లు త‌రువాత రాజ్‌భ‌వ‌న్‌కు కేసీఆర్‌

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు..  రాజ్‌భవన్‌లో జస్టిస్​ ఉజ్జల్ భూయాన్‌తో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు.. తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత ఐద‌వ న్యాయ‌మూర్తిగా ఉజ్జల్‌ భూయాన్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

గువహటిలో 1964 ఆగస్టు 2న జన్మించిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్… గువహటి హైకోర్టులో 1991 మార్చి 20 నుంచి న్యాయవాదిగా పనిచేశారు. 2011 అక్టోబరు 17న గువహటి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.

ఆ తర్వాత 2019 సెప్టెంబరు 3న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా…. బదిలీ అయ్యారు. అనంతరం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా గత అక్టోబరు 22న నియమితులైన జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు… ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హ‌జ‌రైయ్యారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆయన గవర్నర్‌ అధికారిక భవన్‌లో అడుగుపెట్టారు.

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు, తెలంగాణ సర్కార్‌ కు మధ్య గ్యాప్‌ పెరిగిన విషయం తెలిసిందే. సీజే ప్రమాణస్వీకార నేపథ్యంలో  సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు.

 

Related posts