telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

తొలి లోక్ పాల్ ప్రమాణస్వీకారం.. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ..

justice chandraghosh as first lokpal

నేడు(శనివారం) సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ తొలి లోక్‌పాల్‌గా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. లోక్‌పాల్‌ను ఏర్పాటుచేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ జస్టిస్‌ ఘోష్‌ను లోక్‌పాల్‌ చీఫ్‌గా ఎంపిక చేసింది.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్ హాజరయ్యారు. లోక్‌పాల్‌ జ్యూడీషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ప్రదీప్ కుమార్, జస్టిస్ అభిలాష కుమారి, జస్టిస్ అజయ్ కుమార్.

ఇప్పటికే నాన్ జ్యూడీషియల్ సభ్యులుగా దినేష్ కుమార్ జైన్, అర్చనా రామసుందరం, మహేందర్ సింగ్, ఇందరజిత్ ప్రసాద్ గౌతమ్ నియమితులైన విషయం తెలిసిందే. సిట్టింగ్‌ ఎంపీలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి కేసులపై దర్యాప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది.

Related posts