junior-ntrs-second-son

మరోసారి తండ్రైన జూనియర్ ఎన్టీఆర్…

21

తెలుగు టాలివుడ్ నటుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి బాబు పుట్టాడు. గర్భవతిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి ఈరోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది, అభయ్ రామ్ కి తమ్ముడొచ్చాడన్న ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

నాలుగేళ్ళ క్రితం ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతి దంపతులు అభయ్ రామ్ కు జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే అభయ్ రామ్ కి తమ్ముడు పుట్టాడని, మా ఫ్యామిలీ అంచెలంచెలుగా ఎదుగుతుంది అని ట్విట్టర్ లో ఎన్టీఆర్ పంచుకున్నాడు. ఎన్టీఆర్ పెట్టిన పోస్టుకు పలువురు అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘అరవింద సమెత’ చిత్రంలో నటిస్తున్నాడు.