junga

“జుంగా” ట్రైలర్… వైరల్…

28

విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ గ్యాంగ్ స్టార్ కామెడీ చిత్రం “జుంగా”. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సయేశా, మడోన్నా సెబాస్టియన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంది. మంచి నిర్మాణ విలువలతో సినిమాను నిర్మించారని ట్రైలర్ ను చూస్తేనే అర్థమవుతోంది. మాస్ ప్రేక్షకులకే కాదు క్లాస్ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.