tamilnadu judgement

తీర్పు ఫై జడ్జీల మధ్య కుదరని ఏకాభిప్రాయం…

20

తమిళనాట ఉత్కంఠకు తెర లేచింది. గత ఐదు నెలలు గా రిజర్వు లో ఉన్న 18 మంది దినకరన్ వర్గ ఎమ్మెల్యేలఫై స్పీకర్ వేసిన అనర్హత వేటు ఫై ఈ రోజు తీర్పు వెలుబడింది. ఈ కేసులో మరో కొత్త ట్విస్ట్ ఏర్పండింది. ఈ తీర్పు ఫై జడ్జీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు రెండు వేరువేరు తీర్పులిచ్చారు. దీనితో మరో జడ్జి ముందుకు ఈ కేసు వెళ్లనుంది.

ఈ తికమక తో ఈ పి ఎస్, ఓ పి ఎస్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. మరో వైపు దినకర్ వర్గం ఆందోళనలో ఉంది. ఇరు వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి సుందర్ స్పీకర్ తీరును తప్పు తప్పుపట్టారు. ప్రస్తుతం వెలువరించిన తీర్పుతో తమిళనాడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేనట్టే, అనర్హత ఎమ్మెల్యేలపై స్టేటస్కో(నిలుపుదల) కొనసాగుతుంది.