telugu navyamedia
క్రైమ్ వార్తలు

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు : లైంగిక సామ‌ర్ధ్యం క‌లిగి ఉన్నార‌ని వైద్యులు రిపోర్ట్‌

*జూబ్లీహీల్స్‌రేప్‌కేసులో మ‌రోట్విస్ట్‌..
*పోలీసుల‌కు అందిన మైన‌ర్ల మెడిక‌ల్ రిపోర్ట్‌
*లైంగిక సామ‌ర్ధ్యం క‌లిగి ఉన్నార‌ని వైద్యులు నివేదిక‌
*చార్జిషీట్ లో కీల‌కం కానున్న మెడిక‌ల్ రిపోర్ట్‌

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసుల చేతికి మెడికల్ రిపోర్ట్ అందింది. ఐదుగురు మైనర్లకు ఉస్మానియా వైద్యులు పొటెన్సీ టెస్ట్ చేశారు. లైంగిక సామర్థ్యం కలిగి ఉన్నారని వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. ఈ మేరకు పొటెన్సీ టెస్ట్ రిపోర్ట్‌ను పోలీసులు చార్జ్‌షీట్‌లో చేర్చనున్నారు.

కేసులో ఏ1 ఉన్న సాదుద్దీన్‌ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరో ఐదుగురు మైనర్లు జువైనల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీంతో వారికి బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కౌంటర్ పిటిషన్‌ దాఖలు చేశారు.

కాగా..అత్యాచారానికి పాల్పడిన నిందితులు బెంజ్ కారులో ప్రయాణం చేసేటప్పుడు బాధితురాలితో వీడియోలు ఎందుకు తీసుకున్నారు? ఆ వీడియోలు ఎలా బయటికి వచ్చాయి? వైరల్గా ఎలా మారాయి? అన్న అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఐదు రోజుల పాటు జూబ్లీహిల్స్ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులు వీడియోల గురించి ఎలాంటి విషయాలు చెప్పకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. వీడియోలను వాట్సాప్ గ్రూపులోకి పంపించిన సూత్రధారుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు పరిశోధిస్తున్నారు. ఇప్పటికే వేల మంది వాట్స్అప్ ద్వారా వీడియోలు షేర్ చేసుకున్నారని, ప్రసార మాధ్యమాలు, యూట్యూబ్ లోనూ ఉన్నాయని తెలుసుకున్నారు.వాటిని తొలగించాలంటూ ఆయా సంస్థల ప్రతినిధులు లేఖలు రాశారు.

నిందితుల నేరశైలి గుర్తించేందుకు..

తీవ్ర నేరానికి పాల్పడిన ఆరుగురు నిందితులు ప్రవర్తన, వ్యవహారశైలిని గుర్తించేందుకు పోలీసులు సామాజిక మాధ్యమాలు, నిందితుల ఫోన్ లను పరిశీలిస్తున్నారు. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ అకౌంట్ లలో వారు గతంలో పోస్ట్ చేసిన ఫోటోలు, సామూహిక అత్యాచారం అనంతరం బాధితురాలి మెడపై పంటిగాట్లు చేసి ‘టాటూలు’ అనడం, కాన్సూ బేకరి వద్దకు చేరుకుని అందరూ కలిసి ఫోటో తీసుకున్నాక ఫేస్బుక్లో ‘ఇప్పుడే పార్టీ పూర్తయింది’ అని పోస్ట్ చేసిన అంశాన్ని ప్రాధాన్యంగా పరిశీలిస్తున్నారు. నిందితుల వాట్సాప్ సంభాషణలు… రోజు వారి అలవాట్లు, ధూమపానం, కాలేజీలో వారి ప్రవర్తన వంటి అంశాలపై సమాచారం సేకరించి మానసిక నిపుణుల ద్వారా విశ్లేషించనున్నారు. వారి విశ్లేషణ ఆధారంగా నేర ప్రవృత్తిని అంచనావేసి అభియోగ పత్రాలలో సమర్పించనున్నారు.

నిందితుల నేరశైలి గుర్తించేందుకు..

రేప్‌ ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కీలక సాక్ష్యాధారాలు సేకరించారు. బెంజ్, ఇన్నోవా కార్లలో అత్యాచార ఘటనను రుజువు చేసేందుకు అవసరమైన జీవపరిణామ సూక్ష్మక్రిములు, బాధితురాలి వెంట్రుకలు, నిందితుల లో దుస్తుల్లో చిక్కుకున్న అవశేషాలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. అత్యాచార ఘటనను సాంకేతికంగానూ నిరూపించేందుకు నిందితులు, బాధితురాలి ఫోన్ సిగ్నల్, సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన కార్లను ‘పరిస్థితులు ఆధారాలు’ (సర్కమ్ స్టెన్సెస్ ఎవిడెన్స్) గా అభియోగ పత్రాల్లో సమర్పించనున్నారు. దీంతో పాటు మే 31న కేసు నమోదు అయింది అన్న విషయం తెలుసుకున్న నిందితులు పారిపోయి… చిక్కే వరకు ఒకరితో ఒకరు చేసుకున్న చాటింగ్ లతోపాటు ఇంకా ఎవరితోనైనా చాటింగ్ చేశారా, వివరాలు పంచుకున్నారా అన్న వివరాలనూ సేకరిస్తున్నారు.

Related posts