telugu navyamedia
సినిమా వార్తలు

థియేటర్స్‌ వ‌ద్ద‌ ఎన్టీఆర్‌, రామ‌చ‌ర‌ణ్ సందడి…

దేశంలో ఎక్కడ చూసినా.. ఎక్కడ చూసినా, ఎవరిని కదిలించినా ఆర్‌ఆర్‌ఆర్‌. సినీ ప్రియుల ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు నేడు విడుదలైంది.

సామాన్యుల నుంచి సెలబ్రెటీలు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాకు క్యూలు కడుతున్నారు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ గురువారం రాత్రి తన ఫ్యామిలీతో కలిసి ‘ఏఎంబీ సినిమాస్’లో చిత్రాన్ని వీక్షించారుఎన్టీఆర్​తో పాటు నటుడు కల్యాణ్​రామ్, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. 

సినిమా చూసిన అనంతరం ఎన్టీఆర్‌ బయటకు వస్తూ సినిమా అద్భుతంగా ఉందంటూ అభిమానుల‌కు విక్ట‌రీ సింబ‌ల్ చూపిస్తూ వ‌చ్చాడు

అలాగే భ్రమరాంబ థియేటర్​లో రామ్​చరణ్ దంపతులు సినిమా చూశారు. చెర్రీ భార్య ఉపాసన థియేటర్‌లో సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేసింది.  అంతేకాదు ఉపాసన పేపర్లు చింపుతూ, వాటిని గాల్లోకి ఎగరేస్తూ సంతోషం వ్యక్తం చేసింది.

మరోవైపు, దర్శకుడు రాజమౌళి, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య సైతం థియేటర్ల​లో సినిమా చూశారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కుటుంబం థియేటర్ వద్ద ఉన్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అర్ధరాత్రి స్క్రీనింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ తన భార్య, పిల్లలతో వచ్చారు.

Related posts