telugu navyamedia
సినిమా వార్తలు

“మా”లో బేధాభిప్రాయాలు… నిజమే…!

again issues raised in maa association

“మా” మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ విషయం గురించి ‘మా’ ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ “ఆదివారం తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం (మా) సమావేశం నిర్విఘ్నంగా జరిగింది. కమిటీ సభ్యులు 26మంది మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కొన్ని కారణాల వల్ల వాటిని మేం పరిష్కరించుకోలేకపోయాం. కానీ, ఇది ఉపయోగకరమైన సమావేశం. దీన్ని ఆత్మీయ సమ్మేళనం లేదా అంతరంగిక సమ్మేళనం అనుకోవచ్చు. ఆదివారం సమావేశంలో మెజారిటీ సభ్యులు అత్యవసరంగా ‘ఆసాధారణ జనరల్‌ బాడీ మీటింగ్‌’ పెట్టుకోవాలని సూచించారు. ‘మా’ బైలా ప్రకారం, 900 మంది సభ్యుల్లో 20 శాతం మంది అమోదం తెలిపితే ఆ మీటింగ్‌ జరుగుతుంది. సమస్యలు పరిష్కారం కావాలని కోరుకునే సభ్యులందరూ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అన్నారు.

‘మా’ సమావేశంపై అధ్యక్షుడు నరేశ్‌ మాట్లాడుతూ ‘‘25 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఎమర్జెన్సీ జనరల్‌ బాడీ మీటింగ్‌ జరగలేదు. ఆ సమావేశానికి హాజరుకావాలని ఈ మఽధ్యనే నాకు లేఖ వచ్చింది. అది చూసి అధ్యక్షుడిగా జనరల్‌ బాడీ మీటింగ్‌కు ఆహ్వానించాల్సింది నేను కదా మరెవరో పిలవడమేంటి అనుకున్నా! ఆదివారం జరిగిన మీటింగ్‌ను ఫ్రెండ్లీ మీటింగ్‌ అన్నారు. ఇలాంటి పనులు చేస్తే ‘మా’ ప్రతిష్ట దిగజారుతుంది. ‘మా’కు మంచి చేయాలని వచ్చా. చేసి చూపిస్తా. కొందరు బైలాస్‌ మార్చాలని కోరారు. చిరంజీవి, కృష్ణంరాజు వంటి పెద్దల సలహాలతో అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం’’ అన్నారు.

Related posts