telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఈటల పై అందుకే కక్ష : జీవన్ రెడ్డి

కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అడ్డంకిగా ఈటల మారారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడనికి గండి పడ్డట్లు అయింది. అందుకే మెదక్ జిల్లా లో భూ కుంభకోణంలో ఈటల పెరు తెర మీద కు వచ్చింది. ఈటల అసైన్డ్ భూములను న్యాయ బద్ధంగా కొనుగోలు చేశారని చెప్పుతున్నారు. గతంలో కేసీఆర్ ఆస్తులు ఎంత ఇప్పుడు కేసీఆర్ ఆస్తులు ఎంత. కేటీఆర్ 111 జీవో ను ఉల్లఘించి జాన్వడలో భూమి ని అక్రమించుకుంటే విచారణ లేదు. మల్లారెడ్డి,ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి పైన విచారణ లేదు చర్యలు లేవు. నిఖార్సయిన తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమ తొలినాళ్ళ నుండి ఈటల,హరీష్ అండగా నిలిచారు. మిగతా వాళ్ళందరూ బిటి బ్యాచ్. కొడుకు,బిడ్డ ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. 2004 లో కేసీఆర్ మంత్రి పదవి చెప్పటక కేటీఆర్,కవిత తెలంగాణ కు దిగుమతి అయ్యారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే… కరోనా సమయంలో ఈటలా పని చేస్తున్నారు. విచారణ అధికారులు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందిచాలి కానీ మీడియా కు నివేదిక ఇస్తున్నారు. కలెక్టర్ ఒక్క నిర్ణయనికి వచ్చాక ప్రభుత్వం ఎందుకు. రిటైర్ కలెక్టర్ ధర్మారెడ్డి భూములను ఈటల  పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తెచ్చారు అన్నారు. మరి అప్పుడు ధర్మ రెడ్డి ఏమి చేశారు. ధర్మారెడ్డి పైన ఏసీబీ కేసులు ఉన్నాయి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర బలవంతంగా కేసీఆర్ భూములను తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి అని అన్నారు.

Related posts