telugu navyamedia
విద్యా వార్తలు

జేఈఈ ఫ‌లితాలు విడుద‌ల‌..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశానికి ఈ నెల 3న నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఐఐటీ ఖరగ్​పుర్​ ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ రోల్ నంబర్ మరియు/లేదా వ్యక్తిగత వివరాలను నమోదు చేసి JEE అడ్వాన్స్‌డ్ ఫలితాలను చూసుకోవచ్చు.ఐఐటీ ఖరగ్‌పూర్ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలతో పాటు ఆల్ ఇండియా టాపర్స్, ఇతర వివరాలను కూడా విడుదల చేసింది.

ఈ ఫలితాల్లో జనరల్‌ కేటగిరీలో ఐఐటీ దిల్లీకి చెందిన మృదుల్ అగర్వాల్ టాపర్​గా నిలిచాడు. 360 మార్కులకు గాను 348 మార్కులతో మొదటి ర్యాంకు దక్కించుకున్నాడు. బాలికల విభాగంలో ఐఐటీ దిల్లీ జోన్‌కు చెందిన కావ్య చోప్రా (286మార్కుల) ప్రథమ స్థానంలో నిలిచింది.

కాగా.. జేఈఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో రామస్వామి సంతోష్‌ రెడ్డి తొలి ర్యాంకు సాధించాడు. ఎస్సీ కేటగిరీలో నందిగామ నిఖిల్‌కు మొదటి స్థానంలో నిచిచాడు. గుంటూరుకు చెందిన రుషికేష్‌ రెడ్డి పదో ర్యాంకు దక్కించుకోగా.. విజయవాడకు చెందిన దివాకర్ సాయి 11వ ర్యాంకు సాధించాడు.

ఫలితాల‌ను ఇలా చెక్ చేసుకోండి..
అధికారిక వెబ్‌సైట్ – jeeadv.ac.in కి లాగిన్ అవ్వాలి.
రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి
JEE అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి క్లిక్ ఇవ్వాలి,
ఆ తర్వాత రిజల్ట్ కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

రేపటినుంచే..రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ ప్రారంభం..
అర్హ‌త సాధించిన విద్యార్థులకు రేప‌టి నుంచి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగుతుంది. ఈనెల 27 వ తేదీన మొద‌టి రౌండ్ సీట్ల‌ను కేటాయిస్తారు. మొద‌టి రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 30 లోగా ఆనైల్‌లో రిపోర్ట్ చేయాలి. ఇక న‌వంబ‌ర్ 1వ తేదీన రెండో రౌండ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. న‌వంబ‌ర్ 6 వ తేదీన మూడో రౌండ్‌, న‌వంబ‌ర్ 10 వ తేదీన నాలుగో రౌండ్‌, న‌వంబ‌ర్ 14 వ తేదీన ఐదో రౌండ్‌, న‌వంబ‌ర్ 18 వ తేదీన ఆరోవ రౌండ్ సీట్ల కేటాయింపు ప్ర‌క్రియ జ‌రుగుతుంది. ఇక ఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 1,41,699 మంది విద్యార్థులు హాజ‌రుకాగా, 41,862 మంది విద్యార్థులు అర్హ‌త సాధించారు.

Related posts