jee adv results

జీ (జె.ఈ.ఈ) అడ్వాన్స్ 2018 ఫలితాలు…

56

జీ (జె.ఈ.ఈ) అడ్వాన్స్ 2018 ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలకోసం jeeadv.ac.in ను చూడండి. మే 20 న జరిగిన ఈ పరీక్ష దాదాపు 23 ఐఐటీ లలో విద్యాబ్యాసానికి అర్హతగా నిర్వహించారు. ఈ పరీక్షలో రెండు పేపర్లు పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి, అభ్యర్థులు రెంటికి హాజరై అర్హతను సాధించాల్సి ఉంది.

ఈ విద్యాసంవత్సరానికి ఐఐటీ కాన్పూర్ జీ పరీక్షను నిర్వహించింది. జీ అడ్వాన్ పరీక్షలో వచ్చిన ర్యాంకును బట్టే ఐఐటీ లలో చదివేందుకు అర్హతగా తీసుకోనున్నారు. ఈ ఫలితాలలో అభ్యర్థుల మార్కులతో పాటు వారికి కేటాయించిన ర్యాంకులను నిర్వాహకులు విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం ఉన్న 23 ఐఐటీలలో 11, 279 సీట్లు ఉన్నాయి. మహిళా అభ్యర్థుల కోసం మాత్రమే ఈ ఏడాది 800 సీట్లు ప్రత్యేకంగా కేటాయించడం విశేషం.

రీజియన్ వైజ్ ర్యాంకులు :
ఐఐటీ ఢిల్లీ జోన్ : సాహిల్ జైన్, సి.ఆర్.ఎల్ 2
ఐఐటీ గువహతి జోన్ : ప్రశాంత్ కుమార్, సి.ఆర్.ఎల్ 150
ఐఐటీ కాన్పూర్ : ఆయుష్ కదం,సి.ఆర్.ఎల్  78
ఐఐటీ ఖరాగపూర్ జోన్ : కే.వ్.ఆర్. హేమంత్ కుమార్ చోడిపిల్లి, సి.ఆర్.ఎల్ 5

ఐఐటీ మద్రాస్ : మావూరి శివ కృష్ణ మనోహర్, సి.ఆర్.ఎల్ 5

మీనల్ పాకర్ మహిళా అభ్యర్థులలో తోప్పేర్ గా ఉన్నారు. జీ ర్యాంకు 6, మార్కులు 360కి 318.
ప్రణవ్ గోయల్ జీ టాపర్, మార్కులు 360 కి 318.
మొత్తం 1,55,158 మంది ఈ పరీక్ష రాయగా 18, 138 మంది అర్హత సాధించారు. అయితే ఉన్న సీట్లు మాత్రం 11,279 కాగా, అవి 23 ఐఐటీ లలో ఉన్నాయి.

జీ అడ్వాన్స్ ఫలితాలకై అధికారిక వెబ్ సైట్ jeeadv.ac.in లో లాగిన్ అయ్యి, అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ తదితర వివరాలు నమోదు చేయాలి. స్కోర్ కార్డు మరియు రాంక్ కార్డు ప్రింట్ తీసుకోవచ్చు.

ఈ స్కోర్ కార్డు జో.ఎస్.ఏ.ఏ 2018 కౌన్సిలింగ్ కు అవసరం అవుతుంది.