telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అమె స‌రిగ్గా పెంచ‌లేదు..-ఏపీ సీఎం జగన్ పై జేసీ సంచలన వ్యాఖ్య‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం నాడు తాడిపత్రిలో మీడియా స‌మావేశం నిర్వహించిన ఆయన.. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఆయన్ను తల్లి సరిగ్గా పెంచలేదని ఓ మహాతల్లి చెప్పింది.. ఆమె ఎలా పెంచిందో అడిగి తెలుసుకొంటానన్నారు. ఆమె చెప్పింది కరెక్టే.. ఈయన్ని పెంచడం మా రాజశేఖరరెడ్డికి కష్టం అయ్యింది. వాళ్ల పెంపకం మంచిదే.. కానీ అప్పటికే డైవర్ట్ అయ్యి వాళ్ల తాత రాజారెడ్డి దగ్గరికి ఆయన వెళ్లాడు. తాత రాజారెడ్డి పెంచడంతో సేమ్ టు సేమ్ రాజారెడ్డిలాగే తయారయ్యాడు. మా రాజశేఖరరెడ్డిని ఏమీ అనొద్దు’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతటితో ఆగని ఆయన.. రాష్ట్రంలో విద్యుత్, మంచినీళ్లు, రోడ్లు కూడా సరిగా లేవని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి స‌మ‌ర్ధించారు.

కేటీఆర్ వ్యాఖ్యలకు తగ్గట్టుగానే రాష్ట్రంలో పరిస్థితులున్నాయన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కేటీఆర్ ఎందుకు వెనక్కి తీసుకొన్నారో తెలియదన్నారు. కేటీఆర్  మాట జారినట్టుగా వివరణ ఇచ్చుకున్నా కూడా రాష్ట్రంలో పరిస్థితిని కళ్లకు కట్టినట్టుగా వివరించారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు..

మాకు రోడ్లు లేవు. నీరు లేవు… నిజమే…కావాలంటే నిరూపిస్తానని  జేసీ ప్రభాకర్  రెడ్డి చెప్పారు. .. ఏపీలో పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవద్దని కేటీఆర్ కి జేసీ ప్రభాకర్ రెడ్డి సలహా ఇచ్చారు.

కాగా.. గత కొన్ని రోజులుగా జేసీ ఫ్యామిలీ పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తునే పుకార్లు షికార్లు చేశాయి. ఈ ప్రెస్‌మీట్ వేదికగా దీనిపైనా కూడా క్లారిటీ ఇచ్చేశారాయన. ‘ అవును.. బీజేపీ వాళ్లు మా ఇంటికొచ్చారు.. నేను వాళ్లింటికి వెళ్లలేదు. ఐదు పార్టీల పెద్దలు నాకు టిక్కెట్ ఇస్తారు.. అయినా సరే నాకేమీ వద్దు..’ అని జేసీ చెప్పుకొచ్చారు.

Related posts