jayanagar byelection result

80కు చేరుకున్న కర్ణాటక కాంగ్రెస్ బలం…

9

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో రెండు స్థానాలకు ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. దానికి తరువాత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ఆర్.ఆర్.నగర్ ను కాంగ్రెస్ గెలుచుకోగా, జయనగర్ ఎన్నిక ఫలితాలు నేడు విడుదల చేశారు.

బీజేపీ కర్ణాటకలో మరో అసెంబ్లీ స్థానాన్ని జయనగర్ రూపంలో కోల్పోయింది. బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ పై కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి 2, 889 ఓట్లతో గెలుపొందారు. ఈ ఫలితాలలో కాంగ్రెస్ కు 46 శాతం ఓట్లు, బీజేపీకి 33.2 శాతం ఓట్లు పొందాయి. బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి బి.ఎస్ విజయ్ కుమార్ మృతితో ఈ ఎన్నికలకు దారితీసింది.

సౌమ్యారెడ్డి…కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, జేడీఎస్ పొత్తుతో జయనగర్ లో పోటీ చేసి కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ గెలుపుతో కర్నటకలో కాంగ్రెస్ బలం 80 స్థానాలకు పెరిగింది.

ఈ గెలుపు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా రావటంతో వచ్చే స్థానిక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేఖ శక్తుల విజయం ఖాయమని తెలుస్తున్నా, బీజేపీ కాస్త తగ్గినట్టు ఉన్నా శత్రువులపై తగిన సమయంలో ఆయుధాలను ప్రయోగించేందుకు సన్నాహాలలోనే ఉందని తదనుగుణంగానే పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది.