telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జాన్వీ కపూర్.. చిత్రం వాయిదా..

janvi kapoor movie postponed due to

జాన్వీ కపూర్ ధడక్ అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం తక్త్ తో పాటు ఐఏఎఫ్‌ విమానం నడిపిన తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితమాధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తుంది జాన్వీ. గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ నటిస్తుండగా, ఆమె సోదరుడి పాత్రలో అంగడ్ బేడీ నటిస్తున్నారు. ఇండోర్‌లోని ఫ్లయింగ్ క్లబ్‌లో మూవీకి సంబంధించి యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజుల పాటు వాయిదా పడిందట. అక్కడి వాతావరణ పరిస్థితులు బాగోలేని నేపథ్యంలో చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుందట. త్వరలో మూవీ క్లైమాక్స్ సీన్ తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది చిత్ర బృందం. దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో హీరోగా కనిపించనున్నాడని సమాచారం. కాగా, మహిళా పైలట్ గుంజన్ 1999 కార్గిల్‌ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించి అందరిచే ప్రశంసలు పొందింది. ఆమె ధైర్యానికి మెచ్చిన ప్రభుత్వం శౌర్యవీర్ అవార్డ్ కూడా అందించింది.

Related posts