telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 9, ఆదివారం రాశిఫ‌లాలు

మేషరాశి..

ఆదాయం కూడా పెరుగుతుంది. ఒత్తిడిని నుంచి అధిక‌మిస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. కొత్త రుణాలు చేస్తారు. కష్టానికి త‌గిన ఫ‌లితం ఉండ‌దు. దైవదర్శనాలు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది

వృషభ రాశి..

ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. విద్యార్థులకు వేరే చోట‌ విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ల‌భిస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సమస్యలు తీరతాయి. అవసరమైన వస్తువులకు డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.

మిథునరాశి..

విందు, వినోదాల్లో బంధు, మిత్రులతో స‌మ‌యం గడుపు తారు. స్త్రీలకు మంచి స‌మ‌యం అన్న‌మైంది. భూవివాదాలు నెలకొంటాయి. కుటుంబంలో శుభకార్యాల మంచి స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతుంది. ఆకస్మిక ధనలాభం వ‌స్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

కర్కాటకరాశి..

బంధు, మిత్రులతో కలసి సరదాగా గడుపుతారు. స్త్రీలకు పనిభారం అధికం అవుతుంది. ఉద్యోగ‌స్తుల‌కు శ్రమ పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితుల‌ను క‌లుసుకుంటారు. అనుకోని ధనం ఖ‌ర్చు అవుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. స్నేహితుల సహాయంతో మంచి కార్యానికి శ్రీకారం చుడ‌తారు.

సింహరాశి..

కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తగా రుణయత్నాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మంద‌కొడిగా సాగుతాయి. మనసు ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది.

కన్యరాశి..

ప్ర‌ముఖుల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థికాభివృద్ధి బాగానే ఉంటుంది. ముఖ్య‌మైన‌ పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. చిన్నారులకు విలువైన వ‌స్తువులు అందిస్తారు. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

తులరాశి..

స్త్రీలకు దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు నుంచి విముక్తి పొందుతారు. బంధువులు నుంచి శుభ‌వార్త‌లు వింటారు. స్థిరాస్తి ల‌భిస్తుంది. కుటుంబసమస్యల పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. విద్యార్ధులు పోటీ పరీక్షలు రాసే వారికి ఏకాగ్రత అవ‌స‌రం.

వృశ్చిక రాశి..

ఆలయాలను సందర్శిస్తారు. పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర‌వుతాయి. బాధ్యతలు ఎక్కువ‌వుతాయి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. వ్యాపారాలు అంత‌గా క‌లిసిరావు. కుటుంబంలో అనవసర విష‌యంలో మ‌ధ్య వెళ్ళ‌డం మంచిదికాదు. పాత మిత్రులను కలుసుకుంటారు.

ధనుస్సురాశి..

ఇంట్లో ఖర్చులు అధికమవ‌డంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంఘంలో మంచి పేరు లభిస్తుంది. బంధువులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. దూరప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఏర్ప‌డ‌తాయి.

మకరరాశి…

కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్ప‌డుతుంది. శుభవార్తలు వింటారు. వాహనాలు, భూములు కొంటారు. భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తీరతాయి.

కుంభరాశి…

విద్యార్థులు కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ధనవ్యయం ఎక్కువుగా ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. ఉద్యోగాలలో ఒత్తిడి పెరిగితుంది. మనసులో నిరాశ, అసంతృప్తి ఉంటాయి. పిల్లల ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.

మీనరాశి…

పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. దైవదర్శనాలు చేస్తారు. కుటుంబసమస్యల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం ఏర్ప‌డుతుంది.

Related posts