telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 17, సోమవారం రాశిఫ‌లాలు

మేషరాశి..

రాజకీయ నాయకులకు ప్రయాణాలలో జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది.పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పరిచయాలు పెరుతాయి. ఆర్థికాభివృద్ధి మెరుగుప‌డుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మంద‌గిస్తాయి కుటుంబ సహకారం ఉంటుంది.

వృషభరాశి..

నిరుద్యోగులకు ఉద్యోగ‌వ‌కాశాలు ల‌భిస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. కొన్ని పనులు వాయిదా వేయ‌డం మంచిది ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు మంద‌కొడిగా సాగుతాయి. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

మిథునరాశి..

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శుభ ఫలితాలను అందుకుంటారు. సన్నిహితుల నుంచి ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి.నిరుద్యోగుల‌కు ఉద్యోగయోగం క‌లుగుతుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభిస్తాయి. వ‌స్తు వాహ‌నాలు కొంటారు.

కర్కాటకరాశి..

నిర్ణయాలలో మార్పులు ఏర్ప‌డ‌తాయి. దూరప్రయాణాల్లో జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం బారిన ప‌డుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులతో సఖ్యంగా మెలగాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది.

సింహరాశి..

ద‌గ్గ‌ర‌వారితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనలాభం ఉంది. భూవివాదాలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు అందుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. అభివృద్ధి పనులు చేపడతారు.

కన్యరాశి..

బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్నీ కుటుంబంతో చర్చించి నిర్ణ‌యాలు తీసుకోవాలి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. సన్నిహితులు, మిత్రులతో సఖ్యత ఏర్ప‌డ‌తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి.

తులరాశి..

పనుల్లో ప్రతిబంధకాలు ఏర్ప‌డ‌తాయి. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దూరప్రయాణాలు సోదరులతో త‌గ‌దాలు ఏర్ప‌డ‌తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాల్లో చిక్కులు ఏర్ప‌డ‌తాయి. అప్పుల బాధలు ఎదురవుతాయి.

వృశ్చికరాశి..

కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తుల హోదా పెరగడంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. మానసిక అశాంతి ఏర్ప‌డుతుంది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి.

ధనుస్సురాశి..

కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. ఆకస్మిక ధన లాభం ల‌భించును. శుభవార్త వింటారు. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మకరరాశి..

చేపట్టే పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఏర్ప‌డుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. భూవివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు మంద‌గిస్తాయి.

కుంభరాశి..

శరీరక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు అనుకోని సమస్యలు ఎదుర‌వుతాయి.

మీనరాశి..

అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్ని సమస్యలు. రాజకీయాల వారు తొంద‌ర‌ప‌డి వాగ్దానాలు చేయకండి. వ్యాపారాలు ఒడిదుడుకులు ఎదుర‌వుతాయి.

Related posts