telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 13, గురువారం రాశిఫ‌లాలు…

మేషరాశి..

వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఒప్పందాలు రద్దు అవుతాయి. ఆస్తి వివాదాలు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం బాధిస్తుంది. దైవదర్శనాలు చేస్తారు. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభరాశి..

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్న‌నాటి మిత్రుల‌ను క‌లుసుకుంటారు. వ‌స్తు వాహనాలు కొంటారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

మిథునరాశి..

ప్ర‌ముఖుల‌తో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ‌స్తుల‌కు కార్యాల‌యాల్లో పనిభారం పెరుగుతుంది. అనారోగ్య బారిన ప‌డుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

కర్కాటకరాశి..

సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబం సహాయంతో మీ రంగంలో విజ‌యం సాధిస్తారు . ధనలాభం వ‌స్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు చూస్తారు. వాహనయోగం కులుగుతుంది. ఆరోగ్యంపై దృష్టి సారించడం మంచిది. దైవ కార్యాల‌యాల్లో పాల్గొంటారు.

సింహరాశి…

నిరుద్యోగులకు ఉపాధి అవకాశం ల‌భిస్తుంది.ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు లాభ‌సాటిగా సాగుతాయి.

కన్యరాశి..

కుటుంబంలో సమస్యలు ఎదుర‌వుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండ‌వు. కొన్ని బాధ్యతలు ఇబ్బంది పెడ‌తాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో త‌గాదాలు ఏర్ప‌డ‌తాయి. మానసికంగా దృఢంగా ఉండ‌డం మంచిది.

తులరాశి…

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని ముఖ్య‌మైన ప‌నుల్లో పెద్దల నుంచి సలహలు తీసుకోవ‌డం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనవసర ఆలోచనల వల్ల మానసికంగా ఆందోళ‌న ప‌డ‌వ‌చ్చు. దూరప్రయాణాలు చేస్తారు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఏర్ప‌డ‌తాయి. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికరాశి…

ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ‌స్తుల‌కు పనిభారం ఎక్కువ‌గా ఉంటుంది. కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా గడుపుతారు.

ధనుస్సురాశి…

శుభవార్తాలు వింటారు. ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. కొత్త వ్యక్తులుతో పరిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. వాహనయోగం క‌లుగుతుంది. కుటుంబ‌స‌భ్యుల‌తో సఖ్యత ఏర్ప‌డుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తాయి. దైవ‌ద‌ర్శ‌నం చేయ‌డం మంచిది.

మకరరాశి..

వ్యవహారాలలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. వృత్తి, ఉద్యోగలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొత్త రుణాలు చేస్తారు.కుటుంబ స‌భ్యుల‌తో ఆస్తి వివాదాలు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌డం మంచిది. బంధువులు రాక‌తో ఇల్లు క‌ల‌క‌ల‌లాడుతుంది.

కుంభరాశి…

కుటుంబంలో కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి. దైవదర్శనాలు చేస్తారు. . స్వల్ప అనారోగ్యానికి గురి అవుతారు. వ్యాపారాలు విస్తరించ‌డం జ‌రుగుతుంది. ఉద్యోగ‌స్తులు పై అధికారులు నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి.

మీనరాశి…

పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్ధిక‌ సమస్యల నుంచి బయట పడతారు. ఆప్తుల సలహాలు స్వీక‌రించ‌డం మంచిది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపారాల్లో మీ లక్ష్యాలు నెరవేరతాయి. కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా గుడ‌పుతారు.

Related posts