telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 12, బుధవారం రాశిఫ‌లాలు

మేషరాశి…

వ్యాపార లావాదేవీలు కలసివస్తాయి. వ‌స్తు, భూములు వాహనాలు కొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. బంధువుల‌ నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగాలలో చెప్పుకోతగిన అభివృద్ధి. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.

వృషభరాశి…

ఆర్ధిక సమస్యలను నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. సన్నిహితులు, మిత్రులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. కొత్త . బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య భంగం. విద్యార్థులు విద్యా రంగంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిథునరాశి…

నూత‌న కార్యాలు చేపడతారు . ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం ఏర్ప‌డుతుంది. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

కర్కాటకరాశి..

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వ‌హించ‌డం మంచిది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. నూత‌న వాహనాలు కొంటారు. దైవదర్శనాలు చేస్తారు. ఉద్యోగ‌స్తుల‌కు కార్యాల‌యాల్లో శ్రమ పెరుగుతుంది. మహిళలకు పని భారం పెరుగుతుంది

సింహరాశి…

ఆస్తి వివాదాలు తొలుగుతాయి. ఆలయ దర్శనాలు చేస్తారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో కొద్దిపాటి ఒత్తిడులు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. మీ ఆస్తి పెరగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

కన్య రాశి…

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర‌ ప్రయాణాలు చేసే సముయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ముఖ్య‌మైన పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. కుటుంబంలో సమస్యలు ఎదుర‌వుతాయి. దైవ కార్యాల‌యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ‌స్తులకు స్థాన మార్పిడి ఉంటుంది.

తుల రాశి…

వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. వృత్తి వ్యాపారాల్లోని వారు విజయాలను సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసమస్యల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృశ్చికరాశి…

ప్రముఖులతో నూత‌న పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. విద్యార్థులు క‌ష్ట‌ప‌డితే విజయం సాధిస్తారు. ఆశయసాధనలో ముందడుగు వేస్తారు. నిరోద్యోగుల‌కు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం వ‌స్తుంది. దూర ప్రయాణాల్లో చికాకులు వ‌స్తాయి..జాగ్ర‌త్త వ‌హించండం మంచిది.

ధనుస్సురాశి…

బంధు, మిత్రుల సహకారంతో పనులు పూర్తీ చేస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం. సోదరులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. మీరు అనుకున్న ప‌నులు ధైర్యంతో పనులు పూర్తిచేస్తారు.

మకరరాశి…

అనవసర ఖర్చులు అధిక‌మ‌వుతాయి. బంధువులుతో మాటపట్టింపులు ఎక్కువ‌వుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. బంధు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. దైవదర్శనాలు చేస్తారు. ఆరోగ్యం మంద‌గిస్తుంది.

కుంభరాశి…

వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కుటుంబంలో కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభవార్తాలు వింటారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు స్వీక‌రిస్తారు. ప్ర‌ముఖుల‌తో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.

మీనరాశి…

కుటుంబ వ్య‌వ‌హారాల్లో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. బంధువుల నుంచి సమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి.మహిళలకు శుభ వార్తలు వింటారు. విద్యార్థులకు రాత ప‌రీక్ష‌ల్లో మంచి ఫలితాలు ఉంటాయి.

Related posts