సమాజోద్ధారణలో డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గంలోనే తమ ప్రస్థానం కొనసాగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసిన పవన్ కళ్యాణ్ , నివాళులు అర్పించారు. బావితరాల భవిష్యత్తును ఆలోచించి రిజర్వేషన్ల కల్పన, పౌరులకు హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రజలు అనుసరించాల్సి విధి విధానాలను రాజ్యాంగం ద్వారా కల్పించిన మహనీయుడని కొనియాడారు.
అంబేద్కర్ లాంటి మేథోసంపన్నుడు భారతప్రజానీకానికి నిత్యచైతన్యమూర్తనే భావన వ్యక్తంచేశారు.అంబేద్కర్ ప్రసరించిన వెలుగుల్లో ప్రజల జనజీవనం సాగుతోందని పేర్కొన్నారు. స్వార్థప్రయోజనాలకు దూరంగా రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రజలకు రక్షణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
దోచుకున్నది దాచుకోవడానికే జగన్ స్విట్జర్లాండ్ వెళ్లారు: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్