ప్రస్తుత సమాజం స్వార్థం దారి పట్టిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం జనసేన నేతలతో పవన్ మాట్లాడుతూ…ఉచితంగా అన్నీ అందిస్తాం అనే మాటలతో రాజకీయ నాయకులు యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
జనసేన ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. తాను చాలా దూర దృష్టితో జనసేన పార్టీ స్థాపించానని, రాజకీయం అంటే డబ్బు సంపాదన కాదని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి చెందలేదని, తమ పార్టీపై ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రజలు తమకు ఓట్లేశారని తెలిపారు.
తెలుగు దేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చి దివంగత ఎన్టీఆర్ విషయాన్ని పవన్ ప్రస్తావించారు. పార్టీ పెట్టగానే ఆయనలా అధికారంలోకి రావడం అందరికీ సాధ్యం కాదని, ఆ నాటి పరిస్థితుల కారణంగా ఒక్క ఎన్టీఆర్‌కే అలా జరిగిందని చెప్పుకొచ్చారు.
రాజ్యసభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు…