telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేడు విజ‌య‌వాడు కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌..

*నేడు విజ‌య‌వాడు కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వెళ్ళ‌నున్నారు..
*మ‌ధ్యాహ్నం రూ.2గంట‌ల మీడియా తో మాట్లాడ‌నున్నారు..
*కోన‌సీమ లో నిన్న‌టి ఉద్రిక‌త్త ప‌రిస్థితుల‌పై స్పందించ‌నున్నారు.

నేడు విజ‌య‌వాడ‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్ళ‌నున్నారు. అమ‌లాపురంలో అల్లర్ల వెనుక తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నాయన్న వైఎస్ఆర్‌సీపీ నేతల విమర్శలపై ఆ పార్టీ అగ్రనేతలు ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో మ‌ధ్యాహ్నం రూ.2 గంట‌లకు ప‌వ‌న్ మీడియా తో మాట్లాడ‌నున్నారు..

కాగా..కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ..జేఏసీ, ఉద్య‌మ‌కారులు ఆందోళ‌న తీవ్ర ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.

Thumbnail image

అయితే అమ‌లాపురంలో అల్లర్ల వెనుక తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నాయన్న వైఎస్ఆర్‌సీపీ నేతల విమర్శలపై ఆ పార్టీ అగ్రనేతలు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో నిన్న రాత్రి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు..అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాల‌ని పిలుపు నిచ్చారు. ప్రజలందరూ సంయమనం పాటించాలి. శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.

బాబాసాహెబ్ అంబేడ్కర్ గారంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవ భావమే ఉంటుంది. ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరం. ఆ మహనీయుని పేరుని వివాదాల్లోకి తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల‌ని వెల్ల‌డించారు.

అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైంది. వారి తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారు. వాళ్ళ వైఫల్యాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారు.

ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తూ జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానని పవన్ ప్రకటించారు. వై.సి.పి.ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేన పై రుద్దకండని పవన్ కల్యాణ్ తెలిపారు.

Related posts