telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పరిపాలనా భాషగా తెలుగును అమలు చేయాలి: పవన్ కల్యాణ్

pawan-kalyan

పరిపాలనా భాషగా తెలుగును అమలు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ…ఆంగ్ల మాధ్యమ విషయంలోనూ తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు భాషకు సంబంధించి నేను నా తీరును స్పష్టం చేశాను. రాయలసీమ వంటి గొప్ప తెలుగు నేలకు చెందిన బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి వ్యక్తి తెలుగు భాషను పరిరక్షించట్లేదు’ అని అన్నారు.

‘తెలుగు భాషను పరిరక్షించండి అని అడిగితే దాన్ని కూడా వక్రీకరించారు. ఇంగ్లిషు మీడియం వద్దని అంటున్నారని వక్రీకరిస్తూ ప్రచారం చేశారు. మీ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవద్దట అని ప్రజలతో అంటున్నారు. ఇంగ్లిషు మాధ్యమం అవసరమే. అయితే, తెలుగు మీడియం అనే ఆప్షన్ ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు’ అని పవన్ తెలిపారు.

Related posts