telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్థాన్ కు మరో ఎదురుదెబ్బ.. భారత్ కు ఈయూ ఎంపీల మద్దతు

European-Union mps team

ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి కృషి చేస్తున్న భారత్ కు పూర్తి మద్దతు పలుకుతున్నామని యూరోపియన్ యూనియన్ ఎంపీలు స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ లో రెండు రోజుల పాటు పర్యటించిన 23 మంది ఈయూ ఎంపీలు మీడియా ప్రతినిధులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ఎంపీ మాట్లాడుతూ ఒక అంతర్జాతీయ ప్రతినిధి బృందంగా తాము అన్ని పరిస్థితులను పరిశీలించామని తెలిపారు.

భారత ప్రభుత్వం చేపడుతున్న అన్ని చర్యలకు పూర్తి మద్దతు పలుకుతున్నామని చెప్పారు. భారత ప్రభుత్వంతో పాటు స్థానిక అధికారులు అందించిన ఆతిథ్యానికి ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు.ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘనకు భారత ప్రభుత్వం పాల్పడుతోందని, అక్కడ ఏం జరుగుతోందో కూడా బయట ప్రపంచానికి తెలియనివ్వడం లేదంటూ ఇప్పటి వరకు అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్ కు ఈయూ ఎంపీల చేసిన వ్యాఖ్యలతో మరో ఎదురుదెబ్బ తగిలింది.

Related posts