telugu navyamedia
రాజకీయ

హనుమాన్ ఊరేగింపు హింస కేసులో నిందితుడు అరెస్ట్ ..

*హనుమాన్ జ‌యంతి శోభాయాత్ర లో హింస‌..
*ఎస్‌ఐపై కాల్పులు..  8 మంది పోలీసులు, స్థానికుడికి గాయాలు
*21 మంది నిందితుల అరెస్టు
*3 తుపాకులు, 5 కత్తులు స్వాధీనం

ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో జ‌రిగిన హ‌నుమాన్ జ‌యంతి ఊరేగింపులో హింసకు సంబంధించిన ప్ర‌ధాన నిందితుడైన అన్సర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాగా ఇత‌డిని కోర్టుకు తీసుకువెళుతుండ‌గా..తెలుగు సూప‌ర్ హిట్ మూవీ పుష్ప‌లో డైలాగ్ ..ఝ‌ఖేగా న‌హీ అంటూ మీడియాకు ఫోజులిస్తూ లోప‌లికి వెళ్లాడు. ప్ర‌స్తుతం ఈ విడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

హనుమాన్‌ శోభాయాత్ర సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో శనివారం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటిదాకా 21 మందిని అరెస్టు చేసినట్లు, ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాన నిందితుడు అన్సర్‌తోపాటు ఎస్సైపై కాల్పులు జరిపిన‌ మహ్మద్‌ అస్లాంను అరెస్టు చేశారు. ‘మసీదు సమీపంలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. 8 మంది పోలీసులు, ఒక స్థానికుడు గాయపడ్డారు. అన్సార్ ని విచారిస్తున్నామ‌ని ..అత‌ని కాల్ రికార్డుల‌ను కూడా త‌న‌ఖీ చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల నుంచి మూడు తుపాకులు, ఐదు కత్తులు స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు. ఇతర నిందితులనూ గుర్తిస్తాం. బులెట్‌ గాయాలైన ఎస్‌ఐ పరిస్థితి నిలకడగా ఉంది’ అని తెలిపారు. 2020 ఫిబ్రవరి తర్వాత ఢిల్లీలో మత ఘర్షణలు ఇదే మొదటిసారి.

Related posts