telugu navyamedia
తెలంగాణ వార్తలు

ముంబైలో జగిత్యాల వాసి కిడ్నాప్​..రూ.15 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

*ముంబైలో జగిత్యాల జిల్లా వాసి కిడ్నాప్
*దుబాయ్ నుండి తిరిగి వస్తుండగా బంధించారు
*రూ.15 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

పొట్టకూటి కోసం ఉపాధి కోసం కుటుంబాన్ని వదిలి దుబాయ్ లో పని కోసం వెళ్లిన తెలంగాణ వాసి కిడ్నాప్‌నకు గురయ్యాడు.

ఈ ఏడాది జూన్ 22న దుబాయ్ నుండి జగిత్యాల జిల్లా నందగిరికి చెందిన మత్తమల్ల శంకరయ్య ముంబై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో శంకరయ్యను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

అనంతరం శంకరయ్య ను తాళ్లతో కట్టేసి బంధించిన ఫొటోను కిడ్నాపర్లు అతడి బాధిత కుటుంబ సభ్యులకు పంపించి రూ.15 లక్షలు డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే..

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన శంకరయ్య ఈ నెల 22న దుబాయి నుంచి ముంబైకి వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కే క్రమంలో అతను కిడ్నాప్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే కిడ్నాపర్లు శంకరయ్య ఫొటోను ఇంటర్‌నెట్‌ ద్వారా అతడి కుమారుడు హరీశ్‌ వాట్సాప్‌కు గురువారం పంపించారు. ఇంటర్‌ నెట్‌ ద్వారా ఫోన్‌ చేసిన కిడ్నాపర్లు తమిళ, మళయాల భాషల్లో మాట్లాడారు. రూ.15 లక్షలు ఇస్తేనే శంకరయ్యను వదిలిపెడతామని తేల్చి చెప్పారు.

అయితేపేద కుటుంబమైన తాము రూ.15 లక్షలు ఎక్కడి నుంచి తేవాలని కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. ఇంటి పెద్ద దిక్కు కిడ్నాప్​ కావడంతో అతని భార్య అంజవ్వ, కుమారుడు హరీశ్, కూతురు గౌతమి వారం రోజులుగా క్షణక్షణం భయం భయంగా గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రత్యేక చొరవ చూపి శంకరయ్య క్షేమంగా ఇంటికి చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు. 

శంకరయ్య కుమారుడైన హరీష్ ముంబై వెళ్లి అక్కడి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. . శంకరయ్య ఎక్కడ ఉన్నాడనే దానిపై పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. 

Related posts