Jagan's footpath for selfies ...?

సెల్ఫీల కోసమే జగన్ పాదయాత్ర….?

27
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో వైసీపీ అద్ధ్యక్షుడు వై యస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఉదయం రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి పాద యాత్ర ప్రారంభించారు. పాదయాత్ర శంభు నగర్, లక్ష్మి నరసింహ నగర్, మీదుగా ధవళేశ్వరం చేరుకుని అక్కడ బోజనం చేస్తారు. అక్కడ నుండి ధవళేశ్వరం, బొబర్లంక, పెరవరం వరకు పాదయాత్ర కొనసాగనుంది. 
జనం మధ్య తిరిగే నాయకులను కలిసేందుకు ఎప్పుడూ జనం పోటీ పడుతుంటారు. అందులో పేరున్న నేత వస్తున్నారంటే ఏదో ఒక సమస్యతో ఆయనకు అర్జీ ఇవ్వాలని కొంత మంది ప్రయాసపడుతుంటారు. ఆ నేత అక్కున్న చేర్చుకుని ఓదారుస్తాడు అని ఆశ పడుతారు. కానీ వాళ్లు కనీసం పటించుకోకుండా పక్కకి నెట్టేస్తే సమస్య పరిష్కారం కోసం వచ్చిన జనాల మాట ఏమిటి?
Jagan's footpath for selfies ...?
అచ్చం ఇలాంటి ఘటనే జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రలో జరిగింది. 
రాజమహేంద్ర వరం లో యాత్ర ప్రారంభించిన జగన్ ను కలిసేందుకు చాలా మంది పోటేత్తారు. కొందరు సెల్ఫీల కోసం పరుగు పెట్టారు, వాలందరికి సాదరంగా ఆహ్వానించిన ప్రతిపక్ష నేత సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలని అడిగేందుకు వచ్చిన దళిత నాయకుడిని మాత్రం అసలు పటించుకోలేదు. మెమోరాండం ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తి కింద పడిపోయినా, బౌన్సర్లు నేటేసినా కనీసం వారించకుండా మహిళలను పరామర్శిండంలోనే జగన్ మునిగిపోయారు.   
Jagan's footpath for selfies ...?
 
ఈ ఘటన ఇప్పుడు పలు విమర్శలకు దారితీస్తుంది. అయితే ఇది పొరపాటున జరిగిందా..లేక దళిత నేత అని..చిన్నచూపా అనే విధంగా ఈ విమర్శలు వార్తా మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి.  నా వెనక ఎంతమంది ఉన్నారో అని చూపించుకోడానికా.. లేక ప్రజల సమస్యలు తెలుసుకొని ముందు ముందు పరిష్కారాలు చేయటానికా…అనేవిధంగా ఉందని వ్యతిరేక నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా ఎక్కడ చీమ చిటుక్కుమన్నా అనేక విమర్శలు వస్తున్న సందర్భంలో ఇటువంటివి పెద్ద దుమారమే లేపనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.