telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

నీట్, జేఈఈ పై తెలుగు రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ

stalin dmk

నీట్, జేఈఈ పరీక్షలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ లకు డీఎంకే అధినేత స్టాలిన్ లేఖ రాశారు. నీట్, జేఈఈ పరీక్షల విషయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి ఆయన తీసుకొచ్చారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోందని, పలు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలను నిర్వహిస్తే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, చత్తీస్ గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.

Related posts