jagan tweet on apcm administration

చంద్రబాబు పాలన పై జగన్ ‘ట్వీట్ ‘

14
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా చంద్రబాబు నాయుడు  అధికారం లోకి వచ్చి నాలుగేళ్లు  అయింది. ఈ సందర్బంగా చంద్రబాబు,  నారా లోకేష్ గొప్పలు  చెప్పుకొంటున్నారని,  బాబు నాలుగేళ్ల పాలనలో అవినీతి పెరిగిపోయిందని  వై.ఎస్ జగన్ విమర్శించారు.   రాష్ట్రాన్ని అభివృద్ధిలో కాదు అప్పుల్లో పెట్టిందని  ఆయన ఆరోపించారు.  చంద్రబాబు  పాలనలో ఏయే వర్గాలకు అన్యాయం జరిగిందో తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
 
 ‘ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా విషయంలో అన్యాయం జరిగింది. యువతకు ఉద్యోగాలు లేవు. రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయలేదు, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేశారు. బాబు కేవలం గొప్పలు చెప్పుకొంటున్నారు, ఇలా నాలుగేళ్ల చంద్రబాబు పాలన ఒక విధ్వంసంలా సాగింది, రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారు..’ అని జగన్ ట్వీట్ చేశారు.