telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో 16 కోట్ల మాస్కుల పంపిణీ: సీఎం జగన్‌ ఆదే

ఏపీలో కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఒక్కొక్కరికి మూడు చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డితోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కరోనా హైరిస్క్‌ ఉన్నవారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఏపీలో వృద్ధులు, మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రులకు తరలించాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అన్ని రకాల చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని జగన్ సూచించారు.

Related posts