నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఈ వ్యవహారం పై బుధవారం సాయంత్రం క్యాంప్ ఆఫీసులో నెల్లూరు నేతలతో సీఎం భేటీ కానున్నారు. నెల్లూరు జిల్లా నేతల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరుపై జగన్ సీరియస్ అయ్యారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో నేతల మధ్య సమన్వయ లోపంపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి విష్ణువర్దన్‌రెడ్డి తీరుపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి తన ఇంటిపై దాడిచేశారని, దౌర్జన్యం చేశారని వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇచ్చిన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎంపీడీవో సరళపై దౌర్జన్యం చేసిన కేసులో కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ పై వచ్చిన తర్వాత కోటంరెడ్డి మాట్లాడుతూ, ఎంపీడీవో సరళను ఇక్కడకు తీసుకొచ్చింది కాకానే అని ఆయన నేరుగా ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్వేచ్ఛను కాకాని దుర్వినియోగం చేశారని అన్నారు.