telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రెండు జాతీయ పార్టీలకు టీఆర్ఎస్ ను చూస్తే వణుకు: మంత్రి జగదీశ్‌రెడ్డి

Jagadish Reddy,KCR

హుజూర్‌ నగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైనాయని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలకు టీఆర్ఎస్ పార్టీని చూస్తే వణికి పోతున్నాయన్నారు. స్క్రిప్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిది దాన్ని అమలు పరిచేది లక్ష్మణ్ అని దుయ్యబట్టారు. యావత్ భారతదేశంలోనే 24 గంటలు ఉచిత నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

రైతాంగాన్ని నడ్డి విరిచింది కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. వరుసగా ఎనిమిది ఏండ్లు ఎడమకాలువను ఎండబెట్టి కిందికి నీళ్లు వదులుతుంటే ఉత్తమ్ ఎందుకు అడ్డుకోలేక పోయాడని ప్రశ్నించారు. మాయ మాటలతో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ పాలిత రాష్ట్రాలలోను ఉచితంగా విద్యుత్ అందించలేక పోయారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోను మోటర్లకు మీటర్లు పెట్టి యూనిట్ కు 1.35 పైసలు వసూలు చేస్తున్న చరిత్ర బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉందన్నారు.

Related posts