telugu navyamedia
సినిమా వార్తలు

మహేశ్వరి కోసం మేమిద్దరం ట్రై చేశాం… కానీ… : జేడీ చక్రవర్తి

JD-Chakravarthy

సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ఓ టీవీ ఛానెల్ ఇచ్సిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “గులాబి” చిత్రం షూటింగ్ సమయంలో హీరోయిన్ మహేశ్వరి కోసం దర్శకుడు కృష్ణవంశీతో జరిగిన గొడవ గురించి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మహేశ్వరిని తామిద్దరం ప్రేమించామని, కానీ ఆమె తమలో ఎవరినీ ప్రేమించకపోగా, ఇద్దరినీ సోదరులుగా భావించిందని వెల్లడించారు. మహేశ్వరి తమతో స్నేహభావంతోనే ఉన్నా తామే అపోహపడ్డామని తెలిపారు. అయితే అప్పటి స్పర్ధ కారణంగా తామిద్దరూ మాట్లాడుకోలేదని తెలిపారు. ఇప్పుడా గొడవలేవీ లేవని జేడీ చక్రవర్తి స్పష్టం చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్లుగా పనిచేసినప్పటి నుంచి కృష్ణవంశీ, జేడీ చక్రవర్తి మంచి మిత్రులు. అయితే మహేశ్వరి ఎపిసోడ్ ఇద్దరి మధ్య మనస్పర్ధలను సృష్టించింది. ఇక తాను లైఫ్ లో పెళ్లి చేసుకుని సెటిలవడానికి ప్రధాన కారకుడు రామ్ గోపాల్ వర్మేనని జేడీ చక్రవర్తి చెప్పారు. అన్ని విధాలుగా తనకు వర్మ స్ఫూర్తి ప్రదాత అని, అలాంటి వ్యక్తి ఒకరోజు, జేడీ నువ్వు పెళ్లి చేసుకుంటేనే బాగుంటుందని అని చెప్పడంతో పెళ్లి ఆలోచన చేశానని చెప్పుకొచ్చారు.

Related posts