ఐటీ శాఖ అధికారులు డీఎంకే నేత కనిమొళి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న ఆమె నివాసం, పార్టీ కార్యాలయంలో పది మంది ఐటీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆమె భారీగా నగదు వినియోగిస్తున్నారన్న ఆరోపణల మేరకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న డీఎంకే శ్రేణులు ఆమె నివాసం వద్దకు చేరుకున్నాయి. లోపలికి వెళ్లేందుకు యత్నించిన డీఎంకే కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుండి ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.