telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తాత్కాలిక ఏర్పాట్లతో .. ప్రయాణికులకు ఇక్కట్లు.. భయపడుతూనే ప్రయాణం..

Accident

తెలంగాణ ఆర్టీసీ సమ్మె తో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిపిస్తుంది. ఇది అవసరానికి తగినంతగా లేకపోయినా ప్రయాణికులు వీలైనంతమంది సౌకర్యాన్ని వినియోగించుకుంటూనే ఉన్నారు. సాధారణంగా ఆర్టీసీ లో ఎప్పటికప్పుడు బస్సులకు కనీస మరమ్మతులు చేస్తుండేవారు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవటం, తాత్కాలిక ఉద్యోగులు కొంత ఆందోళనగానే వారి విధులను నిర్వర్తించడం లాంటివి ప్రమాదాలకు దారితీస్తున్నాయి.

సమ్మె కారణంగా ఆర్టీసీ అద్దె బస్సులను పలు రూట్లలో నడుపుతున్న విషయం తెలిసిందే. ఓ రూట్ లో తిరుగుతున్న అద్దె బస్సు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని భాగ్యలత ప్రాంతం సమీపంలో అద్దె బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన బస్సు డివైడర్ మీదుగా దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో అది కూలిపోయింది. ఆపై ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అలాగే రెండు రోజుల క్రితం నడుస్తున్న బస్సు చక్రం ఊడిపోవటం తెలిసిందే.

Related posts