gaza-border-with-high-alert

ఇజ్రాయిల్ పాలస్తీన సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం…

31

ఇజ్రాయిల్ లో గాజా బార్డర్ లో నిప్పుల వర్షం కురుస్తుంది, సరిహద్దు మొత్తం పోరు యుద్దాన్ని తలపిస్తుంది. ఇజ్రాయిల్ సైనికులకు మరియు పాలస్తీనా పౌరులకు మధ్యలో భారీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయిల్ సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు పాలస్తీనా వ్యక్తులు మృతి చెందగా, పది మందికి పైగా బుల్లెట్ కి గాయాలపాలయ్యారు. గాయాలపాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు, చికిత్స చేస్తున్న వైద్యులు వారి పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిపారు.

gaza-border-with-high-alert

కాల్పులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పాలస్తీనా పౌరులు మరింత రెచ్చిపోయారు. సైనికుల కాల్పులకు ప్రతీకారంగా సరిహద్దు పొడవునా, టైర్లను కలుస్తూ సైన్యానికి సెగ పుట్టించారు. రాళ్లతో సైనికులపై విరుచుకు పడగా పరిస్థితి రణరంగంగా మారింది. చిన్న పిల్లలతో సహా పలువురు తొక్కిసలాటలో గాయపడ్డారు. పాలస్తీనా గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని మాపై సైనికుల దాడులు ఇంకెంతకాలం జరుగుతాయని ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా ఆందోలనలు మొదలెట్టారు.