is this last protest for tsrtc

తెలంగాణ ఆర్టీసీలో ఇదే ఆఖరి సమ్మె అవుతుందా?

18

తెలంగాణ రాష్త్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు వేతన సవరణ కోసం ఈ నెల 11న నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఆర్టీసీ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, తీవ్రమైన నష్టాలలో కూరుకుపోయిందని, సమ్మెలో పాల్గొంటే ఉద్యోగాల నుండి తొలగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు.

ఆర్టీసీ కార్మికులకు నాలుగేళ్లకోసారి వేతన సంఘము ద్వారా వేతనాల పెంపు నిర్ణయం తీసుకొంటారు. 2013 సంవత్సరరానికి సంబంధించిన పీఆర్సీ కాల పరిమితి 2017 మర్చి 31 వ తేదీతో ముగియడంతో 2017 ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతనాలు అమలు కావలిసి ఉంది. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మె నోటీస్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికుల వేతనాలను పెంచాలని, కనీస వేతనం రూ.24,000 వేలు ఉండాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీలో సమ్మెలను నిషేధించడం జరిగిందని, కార్మికులు సమ్మెలో పాల్గొంటే తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు.

రాష్ట్ర విభజన నాటికి తీవ్రమైన నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలని ప్రత్యేక చర్యలు చేపట్టామని, సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు, కార్మికులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా వారికి వేతనాలను పెంచామని తెలిపారు. అయినా సంస్థ పనితీరులో ఎలాంటి మార్పు లేదని, నష్టాలు మరింతగా పెరిగాయని, తాజాగా రూ.1,400 కోట్ల మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ, ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయని తెలిపారు. కార్మిక సంఘాలకు మంత్రుల కమిటీ ద్వారా వాస్తవాలను తెలియజేశామని, సమ్మె అనివార్యమయితే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని తెలిపారు. సమ్మెలో పాల్గొంటే తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుందని, ఆర్టీసీని మూసివేయాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.