telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఉగ్రదేశంగా భారత్.. ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) విభాగం ఏర్పాటు..

IS terrorist special squad in India started

ఉగ్రవాదం విషయంలో భారత్ కు మరో కొత్త తలనొప్పి ఎదురయింది. భారత్ లో పూర్తిస్థాయి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కిరాతక ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ప్రకటించింది. దీనికి విలాయా ఆఫ్ హింద్(ఇండియా స్టేట్-ఇస్లామిక్ స్టేట్ తరహాలో) అని పేరు పెట్టింది. ఈ విషయాన్ని తమ అధికారిక వార్తాసంస్థ అమాక్ ద్వారా ఐసిస్ ప్రకటించింది.

విలాయా ఆఫ్ హింద్ భౌగోళిక పరిధిపై ఐసిస్ స్పష్టత ఇవ్వలేదు. తమ సైనికులు జమ్మూకశ్మీర్ లో భద్రతాబలగాలతో పోరాడుతున్నారని ఐసిస్ ఆ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రకటనను జమ్మూకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ఖండించారు. పశ్చిమాసియాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఉనికిని చాటుకునేందుకు ఐసిస్ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని అభిప్రాయపడ్డారు. భారత్ లో ఐసిస్ ఉనికి లేదని ఆయన తేల్చిచెప్పారు.

యువత దేశభారాన్ని తమ భుజాలపై వేసుకోవడంతో విఫలం అయ్యింది. దీనితో ఉగ్రభూతాలు తమ లక్ష్యం సాధించాయి. భారత్ లో ఎట్టకేలకు ఉగ్రస్థావరాలు ప్రారంభం అవుతున్నాయి. ఇది మరో నరమేధానికి తొలిమెట్టు, అంటే ఇక ప్రపంచంలో ఎక్కడ మానవ బాంబు పేలినా అది ఒక ఉగ్రవాదప్రేరేపిత భారతీయుడై ఉండనున్నాడు. హడావుడిగా తీరిక లేకుండా బ్రతికి, బిడ్డలకు బోలెడంత నగదు మూటకట్టారు కానీ, వారే లేకుండా పోతున్న సందర్భం త్వరలో ఎదుర్కోడానికి సిద్ధం అవ్వండి. ఇది దేశం పట్ల మన నిర్లక్ష్యానికి భారీ మూల్యం.. చెల్లించక తప్పదు. ఇక భారత్ అభివృద్ధి చెందిన దేశం కాదు అని ఖచ్చితంగా చెప్పేయొచ్చు.

Related posts