telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఐఆర్‌సీటీసీ రైలు టిక్కెట్లపై సర్వీస్ చార్జి.. రేపటి నుంచి అమలు!

special train between vijayawada to gudur

ఐఆర్‌సీటీసీ రైలు టిక్కెట్లపై సర్వీస్ చార్జిని రేపటి నుంచి వసూలు చేయనుంది. ఈ మేరకు భారతీయ రైల్వే ఇప్పటికే నిర్ణయం తీసుకోగా దాన్ని రేపటి నుంచి అమలు చేయనున్నారు. ఈ క్రమంలో నాన్ ఏసీ క్లాస్ టిక్కెట్లపై రూ.15 (ఒక్క టిక్కెట్టుకు), ఏసీ క్లాసులకు రూ.30 సర్వీస్ చార్జిని ఐఆర్‌సీటీసీ వసూలు చేయనుంది. ఆ సైట్‌లో బుక్ చేసుకునే టిక్కెట్లపై సదరు చార్జిలను విధించనున్నారు. ఇక ఈ చార్జిలకు జీఎస్‌టీని అదనంగా వడ్డించనున్నారు.

పెద్ద నోట్లు రద్దు అనంతరం దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను అప్పట్లో ఐఆర్‌సీటీసీ రైలు టిక్కెట్లపై సర్వీస్ చార్జిని ఎత్తేశారు. అయితే సర్వీస్ చార్జిలను ఎత్తేశాక ఆ మొత్తం భారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ భరిస్తూ వచ్చింది. కానీ ఇటీవలే ఆ భారాన్ని మోయలేమని, సర్వీస్ చార్జిలను వసూలు చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే బోర్డుకు లేఖ రాశారు. దీంతో రేపటి నుంచి ఐఆర్‌సీటీసీ సర్వీస్ ఛార్జీలు అమలు కానున్నాయి.

 

Related posts