telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

విదేశీయులకే .. కోట్లు పోస్తున్న .. ఐపీఎల్ ..

332 shortlisted for ipl-2020

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 వేలం ఆసక్తికరంగా సాగుతోంది. ఫ్రాంచైజీలన్నీ ఆటగాళ్ల కొనుగోళ్లలో వ్యూహాలు అమలు చేస్తున్నాయి. రెండు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్న సమయంలో అనూహ్యంగా మూడోది ప్రవేశించి ధర పెంచేస్తున్నాయి. క్రికెటర్లను దక్కించుకుంటున్నాయి. తొలి సెషన్‌ ముగిసే సరికి ఆయా జట్లు ఎంపిక చేసుకున్నది 33 మందినే. అందులో 17 మంది విదేశీయులే ఉన్నారు. మొత్తం ఈ 33 మందికి రూ.117.55 కోట్లను ఖర్చుచేశాయి. విదేశీయుల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకే భారీ ధర లభించింది. కాగా ఇంతకుముందు వరకు స్టార్లుగా వెలుగొందిన ఎందరో క్రికెటర్లు నేడు జీరోలుగా మారారు. వారిని కనీస ధరకైనా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ కెరీర్‌ గాయాల కారణంగా కుంటుపడింది. ఒకప్పుడు అతడి చూస్తేనే బ్యాట్స్‌మెన్‌ గడగడలాడిపోయేవారు. ఇప్పుడు అతడిని కొనుగోలు చేసేందుకు ఒక్కరూ ఆసక్తి చూపలేదు. న్యూజిలాండ్‌ విధ్వంసకర ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌కూ చుక్కెదురైంది. క్రీజులో నిలిస్తే బౌలర్లకు చుక్కలు చూపించే విండీస్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌కీ నిరాశే కలిగింది. ఐపీఎల్‌కు వచ్చిన కొత్తలో ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ తన పేస్‌తో ఎలా వణికించాడో అందరికీ తెలుసు. ఈ సారి అతడివైపు ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదు. హ్యాట్రిక్‌ వీరుడు ఆండ్రూ టై, బెన్‌కటింగ్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ను ఈ సారి ఐపీఎల్‌లో చూడలేం!

Related posts