telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రోజా కూతురు అన్షుమాలిక వెండితెర ఎంట్రీ..?

roja

ఎమ్మెల్యేగా రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే జబర్దస్త్ షో లో జడ్జిగా కొనసాగుతూ బిజీ లైఫ్ కొనసాగిస్తున్న ఆర్.కే రోజా. ఇటీవలే తన కూతురు అన్షుమాలిక పుట్టినరోజు వేడుక జరిపి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొత్త చర్చలకు తెరలేపింది. ఈ ఫొటోల్లో అన్షుమాలిక అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. రీసెంట్‌గా రోజా కూతురు అన్షుమాలిక 17వ పుట్టినరోజు జరిగింది. ఇంట్లోనే తల్లిదండ్రులు, కుటుంబం సమక్షంలో జరిగిన ఈ వేడుక తాలూకు పిక్స్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పంచుకుంది రోజా. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. సాధారణంగా ఎప్పుడూ తన కూతురు ఫోటోలను పెద్దగా బయటపెట్టని రోజా పుట్టినరోజు పిక్స్ పోస్ట్ చేయడంతో అన్షుమాలిక హీరోయిన్ కాబోతోందా అంటూ రోజాపై ప్రశ్నల వర్షం కురుపిస్తున్నారు నెటిజన్లు. అయితే రోజా మాత్రం అన్షుమాలిక విద్యాబ్యాసం కొనసాగుతోంది కాబట్టి సినీ రంగప్రవేశం గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది.

Related posts