2.0

రజినీ “2.0”కు డిస్ట్రిబ్యూటర్ల సెగ…!?

15

రజినీకాంత్ సినిమాలు ఎప్పుడూ మంచి క్రేజ్ తో విడుదలవుతాయి. శంకర్, రజినీకాంత్ కాంబినేషన్… సూపర్ హిట్ చిత్రం “రోబో”కు సీక్వెల్… దీంతో సెట్స్ లో ఉండగానే “2.0” రైట్స్ కోసం భారీగా అడ్వాన్సులు ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. “2.0” తెలుగు హక్కుల కోసం సురేష్ బాబు ఆధ్వర్యంలో 80 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాయి ఏషియన్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు. ఇప్పటికే 20 కోట్ల అడ్వాన్సు కూడా ఇచ్చారట. ఒక డబ్బింగ్ సినిమా కోసం ఇంతమొత్తం చెల్లించమనేది అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది టాలీవుడ్ లో.

అయితే లింగా, కబాలి, కాలాతో సినిమాలో కథ లేకపోతే ఎంతటి స్టార్ నటించినా ఫలితం ఉండదని రుజువైంది. దీంతో 80 కోట్లు తిరిగివస్తాయా ? అనే ఆలోచనలో పడ్డారట సురేష్ బాబు టీమ్. పైగా ఏడాది నుంచి అదిగో, ఇదిగో విడుదల చేస్తున్నాం అంటున్నారే తప్ప విడుదల చేయడం లేదు. ఈ చిత్రం సంక్రాంతి వరకు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అంతకాలం ఆగలేమని, అడ్వాన్సు తిరిగి ఇచ్చేయమని అంటున్నారట డిస్ట్రిబ్యూటర్లు. దీనికి లైకా ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఓకే చెప్పారట. దీంతో సురేష్ బాబు టీమ్ వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారట. దీంతో రజినీ ప్లాప్ సినిమాలను సాకుగా చూపి తక్కువ రేటుకు “2.0” సినిమా హక్కులను కొనాలనే వీరి ఆలోచన ఫలించలేదని అంటున్నారు సినీ నిపుణులు. ఒకవేళ వీరు తప్పుకుంటే ఈ సినిమా హక్కుల్ని కొనడానికి దిల్ రాజు సిద్ధంగా ఉన్నారట.

మరోవైపు తమిళ డిస్టిబ్యూటర్లు సినిమాను త్వరగా విడుదల చేయాలనీ ఒత్తిడి తీసుకొస్తున్నారట. దీంతో లైకా హౌసులోనూ శంకర్ పై కొంత అసహనం కన్పిస్తోందట. మరి డిస్ట్రిబ్యూటర్ల సెగతోనైనా ఈ చిత్రాన్ని త్వరగా విడుదల చేస్తారేమో చూడాలి.