telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

“అంతర్జాతీయ మహిళా దినోత్సవం” ఎందుకు ?

on womens day telangana awarded them
మార్చి 8న “అంతర్జాతీయ మహిళా దినోత్సవం”… మహిళా సాధికారతను, వారి హక్కులను గుర్తుచేసే రోజు. అయితే ఈ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని” మార్చి 8నే ఎందుకు జరుపుకుంటామో చూద్దాము. మొట్టమొదటి మహిళా దినోత్సవం 1909 ఫిబ్రవరి 28న న్యూయార్క్ లో జరిగింది. అప్పట్లో దీనిని “నేషనల్ ఉమెన్స్ డే”గా పిలిచారు. 1910 ఆగష్టు డెన్మార్క్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో మార్చి 8వ తేదీనే “ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే”గా జరుపుకోవాలని ప్రతిపాదించారు. కానీ అప్పట్లో ఈ ప్రతిపాదన గురించి ఎవరో పెద్దగా ఆలోచించలేదు. 
1913 ఫిబ్రవరిలో చివరి శనివారాన్ని రష్యా మహిళలు “మహిళా దినోత్సవం”గా జరుపుకునేవారు. 1914 మార్చి 8న ఆదివారం కావడంతో అమెరికన్ మహిళలు ఆరోజున మళ్ళీ “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” నిర్వహించారు. 1917 మార్చి 8న సోవియట్ రష్యాలోని మహిళలు మొట్టమొదటిసారిగా ఓటు హక్కును పొందారు. ఓటు హక్కును పొందిన మార్చి 8వ తేదీనే మహిళా దినోత్సవం జరుపుకోవాలని భావించారు అక్కడు మహిళలు. దీంతో అప్పటినుంచి సోవియట్ రష్యా ప్రభుత్వం మార్చి 8వ తేదీని నేషనల్ హాలిడేగా ప్రకటించింది. రష్యాతో పాటు మరికొన్ని కమ్యూనిస్ట్, సోషలిస్ట్ దేశాలు కూడా మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుకోవడం ప్రారంభించాయి. 1975లో ఐక్యరాజ్య సమితి  మార్చి 8ని “అంతర్జాతీయ మహిళా దినోత్సవం”గా గుర్తించింది. అప్పటినుంచి “అంతర్జాతీయ మహిళా దినోత్సవం”ను మార్చి 8న నిర్వహించడం మొదలైంది.  
ఇక అమ్మగా,. అక్కగా , చెల్లెలిగా,. భార్యగా, ఇల్లాలుగా, ఉద్యోగినిగా… పురుడు పోసుకున్నప్పటి నుంచి ప్రాణం పోయేంత వరకూ మగాడి ప్రతి కదలికలోనూ… కష్టసుఖాల్లోనూ తోడుంటుంది మహిళ. ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది. నిత్యజీవితంలో ప్రతివిషయంలో మగాడికి తోడూ నీడై ఉంటుంది మహిళ. ఈ ఆధునిక యుగంలో మహిళలు దేశాన్ని ఏలే అధినేతలుగా, పైలెట్లుగా, రాజకీయ నాయకురాళ్లుగా, క్రీడాకారిణులుగా… వాణిజ్య రంగంలో, బహుళజాతి కంపెనీల్లో అథిపతులుగా అతివలు… డాక్టర్లుగా, పోలీసులుగా ఇలా ఎన్నో విభాగాల్లో మహిళలు కీర్తి శిఖరాలను అదిఆగమిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు  “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత” అని మనుధర్మ శాస్త్రంలో చెప్పబడింది. ఈ శ్లోకం అర్థం ఏంటంటే… ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో… అక్కడ దేవతలు కొలువై ఉంటారు”. ఇక మనదేశంలో స్త్రీలను గౌరవించే విషయానికి వస్తే… ” స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం” అని గుళ్ళలో, బడులలో, బస్సులలో రాయడానికే పరిమితమైపోయింది. కానీ ఆడవాళ్లను మాత్రం గౌరవించరు. 
అర్ధరాత్రి ఆడది కనిపిస్తే చాలు… మగాళ్లు మృగాలుగా మారి… వావివరసలు మరచి కోర్కెల కోరలతో కర్కశంగా కాటేస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో మనిషి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ మగాళ్ళ ఆలోచనల్లో మాత్రం మార్పు రాలేదు. ఎప్పుడైతే రోడ్డు మీద ఆడది కన్పించగానే… మగాళ్ళకు తోబుట్టువు, అమ్మ గుర్తొస్తారో… అప్పుడే మగాడు మృగాడు కాదు మనిషి అవుతాడు. ఇప్పుడు కాస్త మార్పు వచ్చి మహిళలు తమ అస్థిత్వాన్ని చాటుకుంటున్నారు. తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడుతున్నారు. అందుకు మహిళల్లో కలిగిన చైతన్యంతో పాటు చట్టంలో వచ్చిన మార్పులు, ప్రజల్లో మారిన ఆలోచనా తీరు కూడా కారణం కావచ్చు. మహిళలు అబలలు కాదు ఆయుధాలు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్లో ఇంకా చైతన్యం, ఆర్ధిక స్వావలంబన తో పాటు మహిళా సాధికారిత కూడా పెరగాలని కోరుకుందాం. మహిళల పట్ల గౌరవం పెరగాలని ఆశిద్దాం. 
ఇక తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా వేర్వేరు రంగాల్లో విశేష సేవలందించిన మహిళలకు పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 14 విభాగాల్లో 21 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జగదీశ్వర్‌ ఉత్తర్వులు విడుదల చేశారు.
ఆ పురస్కారాలు అందుకున్న మహిళారత్నలు వీరే : 
సాహిత్యం: డాక్టర్‌ ప్రేమలత, తస్నీమ్‌ జోహెర్‌
నృత్యం: డాక్టర్‌ కె.రత్నశ్రీ
సంగీతం: సుత్రానే కీర్తిరాణి
జానపద కళలు: శివమ్మ, మోతం జంగమ్మ
చిత్రలేఖనం: ఆచార్య గీత
హరికథ: పద్మాలయ ఆచార్య
పారిశ్రామికం: జ్యోతి వలబోజు
క్రీడలు: మిథాలీ రాజ్‌
రక్షణ సేవలు: బొడ్డపాటి ఐశ్వర్య
సాహసాలు: జై భారతీ
ఆడియో ఇంజినీరింగ్‌: సాజిదా ఖాన్‌
సామాజిక సేవలు: కమ్మరి సరస్వతి, బెల్లం మాధవి, అప్కా మల్లురమ, కడప తుకాబాయి, డాక్టర్‌ అమ్మ శ్రీదేవి
పాత్రికేయం: యశోదారాణి
రచన ముడుంబై
సామాజిక గానం: సుద్దాల భారతీ

Related posts