telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఈ నెల 18న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు!

exam hall

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల విడుదలకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. గత సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈసారి అలాంటి పొరబాట్లు పునరావృతం కాకుండా తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు జాగ్రత్తలు తీసుకొంటుంది.

ప్రశ్నపత్రాల మూల్యాంకనం గత నెలాఖరులోనే పూర్తయింది.
స్కానింగ్‌తో పాటు ఇతర పాలనపరమైన ఏర్పాట్లన్నీ కూడా రెండు రోజుల క్రితమే పూర్తయ్యాయి. ఇంతవరకు జరిగిన ప్రక్రియను మరోసారి పునః పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా మంగళవారంతో పూర్తి కానుంది. అన్నీ సకాలంలో పూర్తైతే ఈనెల 18న ఫలితాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.

Related posts