inflination on loc of kiran sector

కుప్వారాలో చొరబాటుదారులు…అడ్డుకున్న భద్రతా దళాలు…

35

కిరణ్ సెక్టార్ లోని కుప్వారాలో మరో సారి లైన్ అఫ్ కంట్రోల్ వద్ద చొరబాటుదారుల జాడలు కనపడటంతో భద్రతాదళాలు ఆరుగురు తీవ్రవాదులను హతమార్చింది.

లైన్ అఫ్ కంట్రోల్ వద్ద భద్రతకు సంబంధించి ఓ ఆపరేషన్ చేస్తున్న సమయంలో చొరబాటు దారుల ఛాయలు కనిపించటంతో కాల్పులు మొదలయ్యాయి, భద్రతాదళాలు కూడా ధీటుగా వారిని ఎదుర్కొని హతమార్చినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలపటానికి అక్కడి అధికారి నిరాకరించారు. భద్రతాదళాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ ఇంకా ఆయా ప్రాంతాలలో కొనసాగుతుందని వారు చెప్పారు.

ఉత్తర కాశ్మీర్ లో ఈ ఏడాది ఎక్కువ చొరబాటుదారుల ప్రయత్నాలకు తోవ అయ్యింది. రెండు నెలలలోనే దాదాపు పది మంది చొరబాటుదారులను లైన్ అఫ్ కంట్రోల్ దగ్గరే హతమార్చారు. ఓ ఆర్మీ అధికారి సిపోయ్ సుకవీరసింగ్ లైన్ అఫ్ కంట్రోల్ వద్ద జూన్ 7న చంపబడ్డారు. ఏడుగురు చొరబాటుదారులు ఆర్మీ క్యాంపుపై దాడిచేసిన విషయం తెలిసిందే. జూన్ 3న మంజీత్ పోస్ట్ లో లైన్ అఫ్ కంట్రోల్ వద్ద చొరబాటుదారులను హతమార్చారు భద్రతాదళాలు.

కుప్వారాలో లో లైన్ అఫ్ కంట్రోల్ వద్ద ఇద్దరు చొరబాటుదారులను భద్రతాదళాలు హతమార్చి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో పూడ్చిపెట్టిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

భారతదేశం అంటే కాల్పుల విరమణ ఆపని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కు స్నేహ హస్తం అందిస్తాననటం దేశంపై దాడికి సైన్యాన్ని సిద్ధం చేసుకోవటానికేనా…ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యపై ఒక నిర్దిష్టమైన పరిష్కారం చూపించి సరిహద్దులలో ప్రజలను స్వాతంత్రంతో, ప్రశాంతతతో జీవించడానికి అవకాశం కల్పించాలని అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్ళనుండి కోరుకుంటున్నది..మరి ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందో చూడాలి.