indore swachh survekshan 2018 award winner hyderabad

ఇండోర్‌లో స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌ 2018… జి.హెచ్.ఎం.సి హైదరాబాద్…

51

ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే అగ్రగామిగా హైదరాబాద్ నగరం నిలిచిందని, కేంద్ర సర్కారు స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 ప్రత్యేక పురస్కారం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈరోజు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆ అవార్డును హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవీంద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ బీ జనార్దన్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ రవికిరణ్ లకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అందజేశారు.

indore swachh survekshan 2018 award winner hyderabad

దేశంలోని ఉన్న మొత్తం 29 రాష్ట్రాల రాజధానులు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న ఘనవ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ నగరానికి స్వచ్ఛ భారత్ మిషన్ అగ్రస్థానం ఇచ్చింది. ఘన వ్యర్థాల నిర్వహణలో జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధ వహించినందుకే ఈ ఘనత దక్కిందని చెప్పారు.

దీనిలో భాగంగా తడి, పొడి చెత్తను వేరుగా చేయడం, పరిసరాల పరిశుభ్రత, గార్బెజ్ పాయింట్లను తొలగించడం, ఘన వ్యర్థాల తొలగింపు, పారిశుధ్య కార్యక్రమాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులతో పాటు దాదాపు 5లక్షల మంది సభ్యులున్న స్వయం సహాయక బృందాల మహిళలు, 10 లక్షలకు పైగా పాఠశాల విద్యార్థుల సహకారాలను చేపట్టిందని తెలిపారు.