telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ముంబయి : .. విదేశాలవైపు మొగ్గుచూపుతున్న … భారతీయులు..

indians are first in Migration

విదేశీ బాట పడుతున్నవారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారని తాజా సర్వే స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు వలసవెళ్లే వారిలో మన దేశానికి చెందిన వారే అగ్రస్థానంలో ఉన్నారు. సుమారు 1.74 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో (1.18 కోట్లు), చైనా (1.07 కోట్లు), రష్యా (1.05 కోట్లు) ఉన్నాయి. ప్రపంచంలో మొత్తం 27.2 కోట్ల మంది వలసప్రజలు ఉండగా, అందులో భారతీయులు సుమారు 6% మంది ఉన్నారు. ది ఇంటర్నేషనల్ మైగ్రెంట్ స్టాక్-2019 పేరిట ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వలసప్రజల జనాభా 2010లో 2.21 కోట్లు ఉండగా, ప్రస్తుతం అది 23 శాతానికిపైగా పెరిగింది.

ప్రపంచం మొత్తం జనాభాలో వలస ప్రజలు 2000లో 2.8% ఉండగా, ప్రస్తుతం అది 3.5 శాతానికి చేరింది. ఎక్కువ మంది అమెరికా (5.1 కోట్లు), జర్మనీ (1.3 కోట్లు), సౌదీఅరేబియా(1.3కోట్లు) వలస వెళ్తున్నారని పేర్కొంది. 2015లో భారత్‌లో 52 లక్షల మంది వలసజనం ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 51 లక్షలకు తగ్గిందని నివేదిక వెల్లడించింది. భారత్‌కు వలస వచ్చిన వారిలో శరణార్థులు సుమారు 4 శాతం ఉన్నారు.

Related posts